logo

2026లో ప్రపంచ తెలుగు మహాసభలు

ప్రపంచ 3వ తెలుగు మహాసభలు 2026 జనవరి 4 నుంచి 6 వరకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిర్వహిస్తామని ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

Updated : 11 Jun 2024 05:23 IST

ఘంటసాల, న్యూస్‌టుడే:  ప్రపంచ 3వ తెలుగు మహాసభలు 2026 జనవరి 4 నుంచి 6 వరకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిర్వహిస్తామని ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం ఘంటసాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ మహాసభలకు ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డితోపాటు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తామన్నారు. 7 దశాబ్దాలు క్రితం ఏర్పడిన ఆంధ్ర సారస్వత పరిషత్‌ తెలుగు భాషా వికాసానికి కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర విభజనతో తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు తెలంగాణ సారస్వత పరిషత్‌గాను, ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్‌గా ఏర్పడ్డాయన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో 2022లో భీమవరంలో, 2024 జనవరిలో రాజమహేంద్రవరంలో మొదటి, రెండో మహాసభలు నిర్వహించామన్నారు. జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి వెంకట రామకృష్ణ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని