పెళ్లికి అంగీకరించలేదని బాలిక బలవన్మరణం
ప్రేమించిన యువకుడితో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని మనస్తాపం చెంది కానూరు సనత్‌నగర్‌కు చెందిన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.
పెనమలూరు, న్యూస్‌టుడే: ప్రేమించిన యువకుడితో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని మనస్తాపం చెంది కానూరు సనత్‌నగర్‌కు చెందిన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. సనత్‌నగర్‌లో పండ్ల రసాల దుకాణంలో పని చేస్తున్న ఆమె(16).. ఇంటర్ చదివే యువకుడితో కొంతకాలం నుంచి ప్రేమలో ఉంది. అతడిని వివాహం చేసుకునే విషయంపై తన తల్లిదండ్రులతో చర్చించింది. చిన్న వయసులో పెళ్లి వద్దని, కొంతకాలం నిరీక్షించాలని వారు అభ్యంతరం తెలిపారు. దీంతో కలత చెందిన ఆమె ఆదివారం సాయంత్రం ఇంట్లో అందరూ ఉండగానే ఓ గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుంది. ఎంతకూ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు లోపలకు వెళ్లి చూసి యువతిని కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా ఎస్‌ఐ అర్జున్‌రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL: అటు తుషార్.. ఇటు సుదర్శన్: తొలి మ్యాచ్‌లోనే అమల్లోకి ఇంపాక్ట్ ప్లేయర్ విధానం
-
World News
మా అమ్మ కన్నీటితో డైరీ తడిసిపోయింది
-
Ts-top-news News
నేటి నుంచి బీఎస్-6.2 నిబంధన అమలు
-
Ts-top-news News
ఇందూరులో పసుపు బోర్డు ఫ్లెక్సీల కలకలం
-
Ts-top-news News
నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో కొత్త టోల్ఛార్జీలు
-
World News
America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!