logo

తాగునీటి సమస్య లేకుండా చూడండి: కలెక్టర్‌

ప్రభుత్వ పథకాలను అర్హులందరూ వినియోగించుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు.

Published : 25 Mar 2023 04:14 IST

తరకటూరు సామూహిక రక్షిత నీటి పథక చెరువును పరిశీలిస్తున్న రంజిత్‌ బాషా, అధికారులు

తరకటూరు(గూడూరు),న్యూస్‌టుడే:  ప్రభుత్వ పథకాలను అర్హులందరూ వినియోగించుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ఆయన గూడూరు మండల పరిధిలోని తరకటూరులో పర్యటించి వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను సందర్శించారు. స్థానిక హెల్త్‌క్లినిక్‌లో గర్భిణులకు అందిస్తున్న సేవలపై సిబ్బందిని ఆరా తీశారు. ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ఐడీలు గురించి ప్రశ్నించగా ఇంకా 130 పెండింగ్‌లో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. నీటితీరువా పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల నుంచి అందిస్తున్న సేవలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు.  జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణ తీరును పరిశీలించి, వంటలను రుచిచూశారు. అనంతరం తరకటూరు సామూహిక రక్షితనీటి పథకాన్ని పరిశీలించి తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్‌ చంద్రయ్యను ఆదేశించారు. సర్పంచి చిన్నం వెంకట రమణమ్మ, ఎంపీటీసీ సభ్యులు జక్కా ధర్మారాయుడు, జడ్పీటీసీ సభ్యులు వేముల సురేష్‌, తహసీల్దారు జీవీ ప్రసాద్‌, ఎంపీడీవో సుబ్బారావు, ఈవోపీఆర్డీ రజావుల్లా, జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగాధికారి సత్యనారాయణరాజు, పీఆర్‌ డీ…ఈ లక్ష్మీనారాయణ, నగరపాలక సంస్థ ఎంఈ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని