logo

పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం

జిల్లాలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేలా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు అధికారులను ఆదేశించారు.

Published : 25 Mar 2023 04:14 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ డిల్లీరావు

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేలా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కార్యాలయంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రమోషన్‌ (డీఐఇపీసీ) కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..పరిశ్రమల స్థాపన ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి లభించడంతోపాటు ఆర్థిక ప్రగతి మెరుగు పడుతుందన్నారు. పరిశ్రమల కోసం దాఖలైన అర్జీలను, ఆన్‌లైన్‌ సింగిల్‌ డెస్కు పోర్టల్‌లో 21 రోజుల్లోగా సంబంధిత శాఖల అధికారులు అనుమతులు మంజూరు చేయాలన్నారు. ప్రోత్సాహకాలు, రాయితీలపై అవగాహన కల్పించి, పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేలా చూడాలని సూచించారు. వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాస పథకంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా పెట్టుబడి రాయితీగా 64 యూనిట్లకు రూ.11.61 కోట్లు తదితరాల మంజూరును ఆమోదించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి వై.వీరశేఖర్‌, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ టి.ప్రసాదరావు, డిప్యూటీ కమర్షియల్‌ టాక్స్‌ అధికారులు టి.నాగప్రసాద్‌, కె.విజయలక్ష్మి, డీఎఫ్‌వో శ్రీనివాస్‌రెడ్డి, ఏఎఫ్‌వో మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని