logo

పనుల వెనుకబాటుపై మంత్రి ఆగ్రహం

పెడన నియోజకవర్గంలో జలజీవన్‌ మిషన్‌ పనుల వెనుకబాటుపై రాష్ట్ర మంత్రి జోగి రమేష్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Published : 01 Dec 2023 03:20 IST

అధికారులతో సమీక్షిస్తున్న జోగి రమేష్‌

పెడన, న్యూస్‌టుడే: పెడన నియోజకవర్గంలో జలజీవన్‌ మిషన్‌ పనుల వెనుకబాటుపై రాష్ట్ర మంత్రి జోగి రమేష్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గంలో వివిధ శాఖల పరిధిలో జరుగుతున్న పనులను మంత్రి సమీక్షించారు. ఈసందర్భంగా ఇంటింటికీ తాగునీటి కుళాయి లక్ష్యంగా చేపట్టిన జలజీవన్‌ మిషన్‌ పనులు ఏడాదిగా మందకొడిగా సాగడాన్ని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇన్‌ఛార్జి ఎస్‌ఈ వి.శ్రీనివాసరావును మంత్రి ప్రశ్నించారు. రూ.85 కోట్లతో చేపట్టిన పనుల్లో ఇప్పటివరకు 25 శాతం కూడా కాకపోవడాన్ని మంత్రి ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆశాఖ డీఈఈ పి.సత్యనారాయణ, ఏఈలు సీహెచ్‌.స్రవంతి, మనోజ్‌ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం హౌసింగ్‌, ఆర్‌అండ్‌బీ, విద్యుత్తు, పంచాయతీరాజ్‌ శాఖల ఇంజినీరింగ్‌ అధికారుల ద్వారా జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. సమావేశంలో మచిలీపట్నం ఆర్డీవో వాణి, మున్సిపల్‌ ఛైర్‌పర్శన్‌ కటకం నాగకుమారి, ఎంపీపీ రాజులపాటి వాణి, కృత్తివెన్ను జడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్శన్‌ గరికపాటి చారుమతి, గూడూరు ఎంపీపీ సంగా మధుసూదనరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని