logo

రైతులను ఉదారంగా ఆదుకోవాలి

తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పంటపై రూ.వేలు పెట్టుబడి పెట్టారని, వారికి సహాయం అందించి  న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Published : 06 Dec 2023 03:54 IST

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పంటపై రూ.వేలు పెట్టుబడి పెట్టారని, వారికి సహాయం అందించి  న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులను ఆదుకునే విషయంలో అవసరమైతే ప్రధాన మంత్రి, కేంద్ర హోం శాఖా మంత్రిని కలుస్తానని, కేంద్ర నుంచి తక్షణ సాయం అందించేలా తనవంతు కృషి చేస్తానని ఒక ప్రకటనలో తెలిపారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కూడా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని, ధాన్యం తడవకుండా అవసరమైన పట్టాలు పంపిణీ చేయాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని