logo

తుపానుతో మినుముకూ నష్టమే

తుపానుతో రైతులు మినుము పంటనూ కోల్పోయే పరిస్థితి నెలకొంది. యంత్రాలతో వరి కోసిన రైతులు దమ్ము చేసి మినుము విత్తనాలు చల్లారు. అవి చాలా చోట్ల మొక్కలుగా ఎదిగాయి.

Published : 06 Dec 2023 03:54 IST

అంగలూరు(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: తుపానుతో రైతులు మినుము పంటనూ కోల్పోయే పరిస్థితి నెలకొంది. యంత్రాలతో వరి కోసిన రైతులు దమ్ము చేసి మినుము విత్తనాలు చల్లారు. అవి చాలా చోట్ల మొక్కలుగా ఎదిగాయి. కొందరు రైతులు వరి కోతలకు ముందే మినుము విత్తనాలు జల్లడంతో అవీ ఇప్పుడు మొక్క దశలో ఉన్నాయి. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఈ చేలు మునిగిపోయాయి. రైతులు మళ్లీ విత్తనాలు కొని జల్లాల్సిన పరిస్థితి నెలకొనడంతో వారికి ఆర్థిక భారం ఇంకా పెరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని