logo

పునరావాస కేంద్రాలకు 4,300 మంది

తుపాను ప్రభావిత ఏడు మండలాల పరిధిలోని 249 గ్రామాల నుంచి మంగళవారానికి 4,300 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. నాగాయలంక మండలంలో 19, కోడూరు 6, మచిలీపట్నం 25, కృత్తివెన్ను 5, అవనిగడ్డ 4, మోపిదేవి 3, బంటుమిల్లి 4, చల్లపల్లిలో 4 చొప్పున పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి.

Published : 06 Dec 2023 03:57 IST

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: తుపాను ప్రభావిత ఏడు మండలాల పరిధిలోని 249 గ్రామాల నుంచి మంగళవారానికి 4,300 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. నాగాయలంక మండలంలో 19, కోడూరు 6, మచిలీపట్నం 25, కృత్తివెన్ను 5, అవనిగడ్డ 4, మోపిదేవి 3, బంటుమిల్లి 4, చల్లపల్లిలో 4 చొప్పున పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. వారికి ఉదయం అల్పాహారం, పాలు మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్నారు.  నీ తుపాను ప్రభావిత మండలాల్లో ప్రాథమిక అంచనాల మేరకు 42,179 హెక్టార్లలో వరి పైరు, 690 హెక్టార్లలో వేరుశనగ పంట దెబ్బతిన్నట్టు గుర్తించారు. నాగాయలంక, మోపిదేవి, మచిలీపట్నం పరిధిలో రేకులతో నిర్మించుకున్న ఒక గృహంతో పాటు 68 ఇళ్లకు పాక్షికంగా నష్టం వాటిల్లింది.

నిత్యావసర సరకుల పంపిణీ : లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చుట్టుముట్టిన నివాస గృహాల్లోని వారికి నిత్యావసరకులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు గుర్తించిన ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, ఉల్లిపాయలు, వంటనూనె, బంగాళాదుంపలతో కూడిన కిట్లు అందజేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారు ఇళ్లకు వెళ్లే సమయంలో కుటుంబానికి రూ.2500 చొప్పున ఇవ్వనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. దెబ్బతిన్న ఇళ్లకు రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందచేయనున్నారు.

పొలాల్లో నీరు తొలగాక నష్టం లెక్కింపు: తుపాను నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించిన రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీశా మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ రాజబాబుతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. తుపాను ప్రభావం తొలగిన అనంతరం పొలాల్లో నీరు తొలగిపోయాక పంట నష్టాన్ని లెక్కించనున్నట్టు కలెక్టర్‌ ఆయనకు తెలిపారు.'

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని