logo

పంట నష్టం లెక్కింపులో జాప్యం వద్దు

తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు డిమాండ్‌ చేశారు.

Published : 06 Dec 2023 04:03 IST

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు డిమాండ్‌ చేశారు. నష్టం అంచనాల్లో మీనమేషాలు లెక్కించకుండా సత్వర చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. తుపాను హెచ్చరికలు వాతావరణ శాఖ ముందునుంచే జారీ చేస్తున్నా అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని విమర్శించారు. పంట దెబ్బతిన్న రైతులతో పాటు ఇతర ఆస్తినష్టం జరిగిన అందరికీ పరిహారం అందించాలని లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని