logo

అపరాల విత్తనాలను ఉచితంగా ఇవ్వాలి: మండలి

రైతులు రెండో పంటగా వేసేందుకు మినుము, మొక్క జొన్న, పెసర విత్తనాలను ఉచితంగా ప్రభుత్వం అందించాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ కోరారు.

Updated : 06 Dec 2023 06:26 IST

మోపిదేవి, న్యూస్‌టుడే: రైతులు రెండో పంటగా వేసేందుకు మినుము, మొక్క జొన్న, పెసర విత్తనాలను ఉచితంగా ప్రభుత్వం అందించాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ కోరారు. మంగళవారం వర్షంలో సైతం మోపిదేవి మండలంలో పర్యటించి రైతుల కష్టాలను చూశారు. నీటమునిగిన పంటను నిబంధనలు సరళతరం చేసి గింజలేకుండా ఖరీదు చేసి ఆదుకోవాలన్నారు. తెదేపా ప్రభుత్వంలో రైతులకు  టార్పాలిన్లను రాయితీపై అందించామని, వైకాపా ఈ పథకాన్ని రద్దుచేసిందని విమర్శించారు. నీటమునిగిన, నూర్చిన ధాన్యపు రాశులను పరిశీలించారు. ఆయన వెంట పార్టీనాయకులు నడకుదిటి జనార్దనరావు, రావి రత్నగిరి, గవిని శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని