logo

Vijayawada: నేడూ విజయవాడ డివిజన్‌లో రైళ్ల రద్దు

తుపాను తీరం దాటడంతో రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది. డివిజన్‌ పరిధిలోని ఆయా స్టేషన్లలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసి ప్రయాణికులకు సమాచారం అందిస్తున్నారు.

Updated : 06 Dec 2023 07:45 IST

రైల్వేస్టేషన్‌(విజయవాడ), న్యూస్‌టుడే : తుపాను తీరం దాటడంతో రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది. డివిజన్‌ పరిధిలోని ఆయా స్టేషన్లలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసి ప్రయాణికులకు సమాచారం అందిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా రైల్వే శాఖ భారీగా రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇతర ప్రాంతాల్లోనూ హైఅలర్ట్‌ ప్రకటించారు. రైల్వే ట్రాక్‌పై నీరు చేరే అవకాశం ఉన్న ప్రదేశాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. 24 గంటలూ రైల్వే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం కిటకిటలాడే విజయవాడ స్టేషన్‌ రైళ్ల రద్దు కారణంగా అన్ని ప్లాట్‌ఫారాలు ఖాళీగా మారాయి. డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్‌తో పాటు అన్ని విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైళ్ల రద్దు, టికెట్ల వాపసు ద్వారా ఆ శాఖకు రూ. కోట్లలో నష్టం వాటిల్లింది. తుపాను నేపథ్యంలో బుధవారం కూడా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పూర్తిగా రద్దు చేసినవి..

07784/07785 గుంటూరు- రేపల్లె, 07786 గుంటూరు-రేపల్లె, 07873/07874 రేపల్లె-తెనాలి, 07875/07876 రేపల్లె-తెనాలి, 07787/07888 రేపల్లె-తెనాలి, 07887 గుంటూరు-రేపల్లె, 22611 చెన్నైసెంట్రల్‌-న్యూజల్పాయిగురి.

పునరుద్ధరణ

తుపాను కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను బుధవారం నుంచి పునరుద్ధరించారు. రైలు నంబరు 12710 సికింద్రాబాద్‌-గూడూరు, 12733 తిరుపతి-లింగంపల్లి, 12764 సికింద్రాబాద్‌-తిరుపతి, 12710 కాకినాడటౌన్‌-బెంగళూరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని