logo

సహాయ చర్యలకు కలెక్టర్‌ ఆదేశం

తుపాను నేపథ్యంలో కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు మంగళవారం నగర, పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Published : 06 Dec 2023 04:07 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : తుపాను నేపథ్యంలో కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు మంగళవారం నగర, పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, మురుగు/వర్షపు నీటి పారుదలకు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. బెంజిసర్కిల్‌, పటమట, ఆటోనగర్‌ 100 అడుగుల రోడ్డు, ఏపీఐఐసీ కాలనీ, గుణదల, మహానాడు రోడ్డు కూడలి, ఈఎస్‌ఐ రోడ్డు, బీఆర్టీఎస్‌ రోడ్డు, మధురానగర్‌ రైల్వే స్టేషన్‌, అజిత్‌సింగ్‌నగర్‌, వాంబేకాలనీ, పాతబస్తీ పాల ప్రాజెక్టు సమీపంలోని చనుమోలు వెంకట్రావు పైవంతెన, రాజరాజేశ్వరీపేట, ఎర్రకట్ట, కేదారేశ్వరపేట, సీతారామపురం కూడలి, ప్రసాదంపాడు, ఎనికేపాడు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఏపీఐఐసీ కాలనీ సమీపంలో గుడిసెలు వేసుకుని తాత్కాలిక నివాసం ఉంటున్న 200 మందికి అక్కడి కల్యాణ మండపంలో ఆశ్రయం కల్పించారు. ఆహారం, తాగునీరు, మందులు తదితరాలు అందించాలని ఆదేశించారు. కామినేనినగర్‌లో గుడిసెలు వేసుకుని 300 మంది ఉండగా.. ఆ ప్రాంతంలో నిలిచిన నీటిని ఇంజిన్లతో తోడేయించారు. వారికి సహాయ సహకారాలు అందించాలన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, అవసరమైతే వారికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రయం కల్పించాలని సూచించారు. తుపాను నేపథ్యంలో అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. తహసీల్దార్‌ వెంకట్రామయ్య, ఆర్‌.ఐ. నాగమల్లేశ్వరరావు, వీఆర్వోలు బాషా, శ్రీనివాస్‌, నాంచారయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని