logo

రైల్వేకు ప్రతిష్ఠాత్మక అవార్డులు

విజయవాడ డివిజన్‌కు అవార్డుల పంట పండింది. అధికారులు, సిబ్బంది కృషి కారణంగా ఈ ఏడాది వివిధ విభాగాల్లో ప్రతిష్ఠాత్మకమైన జీఎం ఎఫిషియన్సీ షీల్డులు కైవసం చేసుకుంది.

Published : 06 Dec 2023 04:08 IST

రైల్వేస్టేషన్‌(విజయవాడ), న్యూస్‌టుడే : విజయవాడ డివిజన్‌కు అవార్డుల పంట పండింది. అధికారులు, సిబ్బంది కృషి కారణంగా ఈ ఏడాది వివిధ విభాగాల్లో ప్రతిష్ఠాత్మకమైన జీఎం ఎఫిషియన్సీ షీల్డులు కైవసం చేసుకుంది. విజయవాడ డివిజన్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికులు, సరకు రవాణా ద్వారా రికార్డు స్థాయిలో రూ.5306 కోట్ల ఆదాయాన్ని గడించింది. వివిధ విభాగాల్లో మొత్తం 10 జీఎం షీల్డులు విజయవాడ డివిజన్‌కు లభించాయి. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు మరింత కృషి చేయాలని డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్‌ అధికారులు, సిబ్బందికి సూచించారు. షీల్డులు సాధించిన సందర్భంగా ఆయా విభాగాల అధికారులు, సిబ్బందిని డీఆర్‌ఎం ప్రత్యేకంగా మంగళవారం అభినందించారు.

కమర్షియల్‌, మెకానికల్‌, ఫైనాన్స్‌(అకౌంట్స్‌), డీజిల్‌, ఈఎల్‌ఎస్‌, వర్క్స్‌, బ్రిడ్జెస్‌, డీఎంయూ, ఈఎంయూ, మెముల నిర్వహణకుగాను రాజమండ్రి మెముకార్‌ షెడ్‌, బెస్ట్‌ లోడింగ్‌, ఆపరేటింగ్‌, సిగ్నల్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్‌ విభాగాలకు అవార్డులు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని