logo

రూపాయి పంపమని.. రూ.లక్షలు కొట్టేశాడు

ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు ప్రకటన ఇస్తే.. అపరిచిత వ్యక్తి ఫోన్‌ చేసి అడ్వాన్స్‌ పంపించేందుకు గూగుల్‌పే ద్వారా రూపాయి పంపమని చెప్పి వృద్ధుడి నుంచి రూ.1,85,495లు కొట్టేశాడో సైబర్‌ నేరగాడు.

Published : 07 Dec 2023 06:01 IST

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు ప్రకటన ఇస్తే.. అపరిచిత వ్యక్తి ఫోన్‌ చేసి అడ్వాన్స్‌ పంపించేందుకు గూగుల్‌పే ద్వారా రూపాయి పంపమని చెప్పి వృద్ధుడి నుంచి రూ.1,85,495లు కొట్టేశాడో సైబర్‌ నేరగాడు. వివరాలు ఇలా ఉన్నాయి... దుర్గాఅగ్రహారానికి చెందిన ఓ వృద్ధుడు (70) న్యాయవాదిగా పనిచేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. ఈ మధ్యనే తన ఇల్లును అద్దెకు ఇచ్చేందుకు ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చారు. గత నెల 10వ తేదీ ఉదయం సమయంలో చెన్నంనేని అక్షయ్‌కుమార్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేశాడు. తాను డిఫెన్స్‌ అకాడమీలో పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. ఆధార్‌ కార్డు, తాను పనిచేసే సంస్థ వివరాలు వాట్సాప్‌ చేశాడు. తాను ఇల్లు అద్దెకు తీసుకుంటానని చెప్పి, అడ్వాన్స్‌ చెల్లిస్తానన్నాడు. దీని నిమిత్తం ముందుగా తనకు గూగుల్‌ పే ద్వారా రూ.1 పంపితే.. అడ్వాన్స్‌ సొమ్ము పంపిస్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మిన వృద్ధుడు.. రూపాయి పంపారు. కొద్ది సేపటికి అతని ఖాతా నుంచి రూ.1,85,494లు విడతల వారీగా మాయమయ్యాయి. దీనిపై సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి సూర్యారావుపేట పోలీసులకు పంపించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు