logo

పెట్టుబడి పేరుతో రూ.1.35 లక్షలకు టోకరా

తమ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే ఆకర్షణీయమైన ఆదాయం ఇస్తామంటూ నమ్మించి.. ఒక మహిళ నుంచి రూ.1.35 లక్షల మేర మోసం చేశారు సైబర్‌ నేరగాళ్లు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.

Published : 07 Dec 2023 06:03 IST

విజయవాడ నేరవార్తలు: తమ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే ఆకర్షణీయమైన ఆదాయం ఇస్తామంటూ నమ్మించి.. ఒక మహిళ నుంచి రూ.1.35 లక్షల మేర మోసం చేశారు సైబర్‌ నేరగాళ్లు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. దుర్గాపురం సాంబమూర్తిరోడ్డుకు చెందిన ఓ మహిళ (27) చరవాణికి అక్టోబరు 5న ఒక వాట్సాప్‌ సందేశం వచ్చింది. దాన్ని క్లిక్‌ చేయగా.. టెలిగ్రామ్‌లో ఒక వ్యక్తి లైనులోకి వచ్చాడు. తమ ఛానల్‌ను రూ.50లు కట్టి సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే ఆదాయం వస్తుందని చెప్పగా.. ఆమె క్లిక్‌ కొట్టారు. ఆమెకు రూ.50 తిరిగి చెల్లించేశారు. మళ్లీ ఆ వ్యక్తే ఫోన్‌ చేసి.. తమ వద్ద పెట్టుబడులు పెడితే ఆకర్షణీయమైన ఆదాయం వస్తుందని చెప్పడంతో ఆమె నమ్మింది. రూ.1000లు పెట్టుబడులు పెట్టగా.. రూ.300లు ఆదాయం వచ్చింది. తర్వాత రూ.5వేలు పెడితే రూ.1500 తిరిగి చెల్లించారు. అక్టోబరు 4న రూ.5వేలు పెట్టుబడులు పెట్టారు. అక్టోబరు 5న వారు ఫోన్‌ చేసి పెట్టుబడులు పెడితే సొమ్ముంతా తిరిగి చెల్లిస్తామని చెప్పారు. దీంతో సదరు మహిళ.. మూడు విడతల్లో రూ.1.35లక్షలు చెల్లించింది. ఆ తర్వాత అవతలి వ్యక్తి ఫోన్‌ ఎత్తకపోవటంతో.. మోసపోయినట్లు గ్రహించి సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు