logo

పెళ్లి పేరుతో యువతి మోసం

పెళ్లి చేసుకుంటానని నమ్మించి నగలు, రూ.11లక్షల వరకు వసూలు చేసి.. వైద్యుడిని మోసం చేసిన ముగ్గురిపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యారావుపేటకు చెందిన ఓ వైద్యుడు (40)కి 2019లో వివాహమైంది.

Published : 07 Dec 2023 06:04 IST

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : పెళ్లి చేసుకుంటానని నమ్మించి నగలు, రూ.11లక్షల వరకు వసూలు చేసి.. వైద్యుడిని మోసం చేసిన ముగ్గురిపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యారావుపేటకు చెందిన ఓ వైద్యుడు (40)కి 2019లో వివాహమైంది. మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఒక మ్యారేజీ బ్యూరో వెబ్‌సైట్‌ ద్వారా అతడిని పెళ్లి చేసుకునేందుకు మైసూర్‌కు చెందిన డాక్టర్‌ పవిత్ర చెల్వురాజ్‌ (39) అనే యువతి ముందుకు వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 27న ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి నిమిత్తం బంగారు ఆభరణాలు, వస్త్రాలు నిమిత్తం రూ.11లక్షలు వరకు వైద్యుడు చెల్లించారు. ఆగస్టు 11న డాక్టర్‌ పవిత్ర చెల్వురాజ్‌.. తాను వివాహం రద్దు చేసుకుంటున్నానని వాట్సాప్‌ మేసేజ్‌ పెట్టింది. దీంతో సదరు వైద్యుడు.. ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ అలా సాధ్యం కాకపోవడంతో సూర్యారావుపేట పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. పోలీసులు డాక్టర్‌ పవిత్రతోపాటు మరో ఇద్దరిపై మోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని