logo

ప్రకాశం బ్యారేజీ గేట్ల ఎత్తివేత

తుపాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. 

Published : 07 Dec 2023 06:05 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : తుపాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. ఫలితంగా ప్రకాశం బ్యారేజీ వద్ద పలు గేట్లు బుధవారం ఎత్తారు. వచ్చిన నీటిని వచ్చినట్టే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు తొలుత నాలుగు గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. ఎగువ నుంచి 6,667 క్యూసెక్కులు వస్తుండగా, దిగువకు 2,908 క్యూసెక్కులు విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎగువ నుంచి వచ్చే వరద 9,672 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో 10 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. దిగువకు 7,450 క్యూసెక్కులు విడుదల చేశారు. సాయంత్రం 5 గంటలకు ఎగువ నుంచి సుమారు 20,000 క్యూసెక్కుల వరద నీరు రాగా, 25 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. సముద్రంలోకి 18,000ల క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యారేజీకి వరద ప్రవాహం నెలకొన్న నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కేసీ డివిజన్‌ ఈఈ కృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని