logo

దుర్గగుడి అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన నేడు

ఈనెల 7న దుర్గగుడి అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

Updated : 07 Dec 2023 11:25 IST

పరిశీలిస్తున్న మంత్రి కొట్టు సత్యనారాయణ, ఛైర్మన్‌ రాంబాబు, ఈవో రామారావు, సబ్‌కలెక్టర్‌ అదితి సింగ్‌  

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఈనెల 7న దుర్గగుడి అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, దుర్గగుడి ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ రాంబాబు, ఈవో రామారావుతో కలిసి ఆయన బుధవారం శంకుస్థాపన ఏర్పాట్లు పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ రూ.216.05 కోట్లతో రెండు దశలుగా దుర్గగుడిని సమగ్రాభివృద్ధి చేస్తామన్నారు. అమ్మవారి అన్నప్రసాద భవనం, ప్రసాదాల పోటుతోపాటు ఎలివేటెడ్‌ క్యూలైన్లు, రాజగోపురం ముందు భాగాన మెట్లు, కనకదుర్గానగర్‌ నుంచి రాజమార్గం అభివృద్ధి, మల్లికార్జున మహామండపాన్ని క్యూ కాంప్లెక్స్‌గా మార్చడం, నూతన కేశఖండన శాల నిర్మాణం, గోశాల భవనాన్ని బహుళ ప్రయోజన  సముదాయంగా మార్చడం వంటి పనులను రెండు దశల్లో పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో స్థానాచార్య శివప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు శంకరశాండిల్య, మురళీధరశాస్త్రి, ఈఈలు కోటేశ్వరరావు, రమాదేవి, డీసీపీ విశాల్‌గున్ని, ఏసీపీ హనుమంతరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని