logo

బాలిక అపహరణ.. నిందితుడి అరెస్టు

ప్రేమ పేరుతో మోసం చేసి పదో తరగతి విద్యార్థినిని ఓ యువకుడు అపహరించిన ఘటనలో నిందితుడ్ని గురువారం అరెస్టు చేసి కోర్టుకు తలించామని గుడివాడ వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.

Published : 08 Dec 2023 03:33 IST

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రేమ పేరుతో మోసం చేసి పదో తరగతి విద్యార్థినిని ఓ యువకుడు అపహరించిన ఘటనలో నిందితుడ్ని గురువారం అరెస్టు చేసి కోర్టుకు తలించామని గుడివాడ వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు. నందివాడకు చెందిన బాలిక (16) పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. నందివాడ మండలం నూతులపాడు గ్రామానికి చెందిన చిన్నం సాయి కుమార్‌ అనే ఓ యువకుడు ఆమెను ప్రేమిస్తున్నాని కొంత కాలంగా వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ నెల 5న రాత్రి ఆమెను అతని బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. బాలిక తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. వన్‌టౌన్‌ ఎస్‌ఐ పి.గౌతమ్‌ కుమార్‌ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అతడి సమాచారం మేరకు బాలికను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు సాయికుమార్‌ను కోర్టుకు తలించగా రిమాండ్‌ విధించారు.


చెక్‌ బౌన్స్‌ కేసులో మహిళకు ఏడాది జైలు

ఉయ్యూరు, న్యూస్‌టుడే: చెక్‌ బౌన్స్‌ కేసులో ఉయ్యూరుకు చెందిన మహిళకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ స్థానిక జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి కంటిపూడి శ్రీహరి తీర్పునిచ్చారు. బాధితుడికి రూ.4,53,200 చెల్లించాలని ఆదేశించారు. పట్టణానికి చెందిన చెందిన వీర్ల వెంకటేశ్వరరావు వద్ద 2016 మే 20న ఉయ్యూరుకు చెందిన ఇస్లావత్‌ లక్ష్మి రూ.2.75 లక్షలు అప్పు తీసుకున్నారు. రుణం తీర్చే క్రమంలో ఆమె వెంకటేశ్వరరావుకు పామర్రు ఎస్‌బీఐ పేరున రూ.2.27 లక్షలకు 2017 డిసెంబరు 10న చెక్‌ ఇవ్వగా.. అది చెల్లుబాటు కాలేదు. దీంతో వెంకటేశ్వరరావు ఉయ్యూరు 10వ అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో కేసు దాఖలు చేశారు. విచారణ అనంతరం ఇస్లావత్‌ లక్ష్మికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి శ్రీహరి గురువారం తీర్పు చెప్పారు. బాధితుడి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.చంటిబాబు వాదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు