logo

సీఐడీ కానిస్టేబుల్‌కు టోకరా

సీఐడీ కానిస్టేబుల్‌కు సైబర్‌ నేరగాళ్లు టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురుకు చెందిన ఎం.సురేష్‌ సీఐడీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటారు

Published : 08 Dec 2023 03:33 IST

పెనమలూరు, న్యూస్‌టుడే: సీఐడీ కానిస్టేబుల్‌కు సైబర్‌ నేరగాళ్లు టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురుకు చెందిన ఎం.సురేష్‌ సీఐడీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటారు. ఇతని ఫోన్‌కు ఈనెల 4వ తేదీన ఎస్‌బీఐ రివార్డ్స్‌ పాయింట్స్‌ను రెడీమ్‌ చేసుకోవాలంటూ ఓ మెస్‌జ్‌ వచ్చింది. దీంతో ఇతను ఈ లింక్‌ను క్లిక్‌ చేసి అందులో ఇతని యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ నొక్కారు. అనంతరం ఇతని బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా రూ.1.25 లక్షలు డ్రా అయినట్లు సమాచారం రావడంతో మోసపోయినట్లు గుర్తించి గురువారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని