logo

రైతులకు నష్టపరిహారం అందించాలి

తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల పరిహారం అందించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజబాబు ప్రభుత్వాన్ని కోరారు.

Published : 08 Dec 2023 03:35 IST

నీట మునిగిన పనలను పరిశీలిస్తున్న రాజబాబు, గాంధీ, సతీశ్‌ తదితరులు

జనార్ధనపురం(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల పరిహారం అందించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజబాబు ప్రభుత్వాన్ని కోరారు. నందివాడ మండలం జనార్దనపురంలో తుపానుతో నీట మునిగిన వరి పొలాలను గురువారం ఆయన పార్టీ నాయకులతో కలిసి  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ తుపాను వస్తుందని తెలిసినా ప్రభుత్వం, అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. రెండేళ్లపాటు రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించాలని కోరారు. తడిచిన ప్రతి గింజను మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌ సూరే లక్ష్మీనారాయణ గాంధీ, జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడాల సతీశ్‌, మండల అధ్యక్షుడు రాంప్రసాద్‌, చప్పిడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని