logo

దళిత సర్పంచిని అవమానిస్తారా?

కె.కొత్తపాలెం సర్పంచికి బుధవారం జరిగిన అవమానాన్ని తెదేపా తీవ్రంగా పరిగణించింది.

Updated : 08 Dec 2023 05:51 IST

క్షమాపణ చెప్పిన తహసీల్దార్‌

అంబేడ్కర్‌ చిత్రపటంతో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బైఠాయించిన సర్పంచి కొక్కిలిగడ్డ మాధవి

మోపిదేవి, న్యూస్‌టుడే: కె.కొత్తపాలెం సర్పంచికి బుధవారం జరిగిన అవమానాన్ని తెదేపా తీవ్రంగా పరిగణించింది. ఎస్టీ బాలికను, ఆమె బంధువులపై దాడి కేసులో నిందితులైన అనిశెట్టి బాబూరావు, మత్తి రాజాచంద్‌తో తుపాను పునరావాస కేంద్రాల్లోని బాధితులకు నగదు పంపిణీని నిరసిస్తూ తెదేపా కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లారు. సర్పంచి కొక్కిలిగడ్డ మాధవి, మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు చందన రంగారావును పిలిచి పునారావాస బాధితులకు పరిహారం పంపిణీ చేయించకుండా నిందితులతో చేయించిన ఉదంతాన్ని తీవ్ర అవమానంగా భావించి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. రెండు గంటలపాటు నిరసన తెలిపారు. తహసీల్దార్‌, ఆర్‌ఐ, వీఆర్వోను సస్పెండ్‌ చేయాలని, ఆర్డీవో వచ్చి చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. బాధిత సర్పంచి అంబేడ్కర్‌ చిత్రపటంతో పాల్గొన్నారు. ఎస్సీ నాయకులు కొల్లూరి వెంకటేశ్వరరావు, దిరిశం వెంకట్రావ్‌, మాచవరపు ఆదినారాయణ, తెదేపా మండల అధ్యక్షుడు నడకుదిట జనార్దనరావు, ఎంపీపీ రావి దుర్గావాణి, రావి నాగేశ్వరరావు, రావి రత్నగిరి, సర్పంచులు పోలిమెట్ల ఏసుబాబు, దిడ్ల జానకి రాంబాబు, దొప్పలపూడి గంగాభవానీ, చందన రంగారావు తదితరులు పాల్గొన్నారు. పరుషంగా మాట్లాడిన వీఆర్‌వో రమణపై చర్యలకు డిమాండ్‌ చేశారు. చర్చల అనంతరం తహసీల్దార్‌ నవీన్‌కుమార్‌ క్షమాపణ చెప్పడంతో ధర్నా విరమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు