logo

ఆర్టీసీ డ్రైవర్‌కు తేలు కాటు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

డ్రైవర్‌కు తేలుకుట్టడంతో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరులో గంటన్నర పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన సంఘటన ఇది.

Published : 22 Feb 2024 08:13 IST

నిలిచిన బస్సు ఇదే..

తిరువూరు, న్యూస్‌టుడే: డ్రైవర్‌కు తేలుకుట్టడంతో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరులో గంటన్నర పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన సంఘటన ఇది. తిరువూరు డిపోకు చెందిన బస్సు మంగళవారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరింది. తెలంగాణ రాష్ట్రంలోని కల్లూరు సమీపంలోని కాకతీయ షుగర్‌ ఫ్యాక్టరీ సమీపంలో డ్రైవర్‌ దొరబాబును సీటు కింద ఉన్న తేలు కుట్టింది. బస్సును జాతీయ రహదారి పక్కన నిలిపి, డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం కల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. డిపోకు ఫోన్‌ చేసి ప్రయాణికులు పరిస్థితిని వివరించినా అధికారులు సకాలంలో స్పందించలేదు. అర్ధరాత్రి వేళ రహదారి పక్కన దోమల బాధతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. గంటన్నర తర్వాత ఆర్టీసీ అధికారులు మరో డ్రైవర్‌ను పంపించి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. ఆర్టీసీ అధికారుల తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. బస్సులో తేలు ఉండడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని