logo

Gudivada: ఉక్రోషమా.. ఉన్మాదమా

ఈ శిలాఫలకం మధ్యలో కనిపిస్తున్నది మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.

Updated : 22 Feb 2024 09:39 IST

ఈ శిలాఫలకం మధ్యలో కనిపిస్తున్నది మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి. గతేడాది ఏప్రిల్‌ 9న గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధుల కోసం పది పడకల నూతన భవనాన్ని ఎంపీ చేతులమీదుగా ప్రారంభించిన సందర్భంలో శిలాఫలకంపై ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల ఫొటోలతో పాటు ఎంపీ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలతో ఎంపీ పార్టీ మారి జనసేనలోకి వెళ్లిపోగా ఉక్రోషం పట్టలేని కొందరు వ్యక్తులు శిలాఫలకంపై ఉన్న ఎంపీ చిత్రంపై కళ్లు కనిపించకుండా ఇలా గీతలు పెట్టి తమ ఉన్మాదాన్ని ప్రదర్శించారు. పార్టీ మారినంత మాత్రాన ఎంపీ పేరు చెరిపి వేస్తారా? తామూ ఇలాగే చేస్తే ఎక్కడా ఇతరుల చిత్రాలు కనిపించవని ఎంపీ అనుచరులు, జన సైనికులు హెచ్చరిస్తున్నారు.

ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని