logo

ఈ-మార్కెటింగ్‌తో రైతులకు సుస్థిర ఆదాయం

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో అందుబాటులో ఉన్న డిజిటల్‌ మార్కెటింగ్‌ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే రైతులు సుస్థిర ఆదాయం పొందవచ్చని కలెక్టర్‌ ఎస్‌.డి…ల్లీరావు అన్నారు.

Published : 23 Feb 2024 05:21 IST

ఉత్పత్తులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ డిల్లీరావు, నాబార్దు జీఎం ప్రసాద్‌, డీజీఎం అబువరాజన్‌ తదితరులు

పటమట, న్యూస్‌టుడే: ఆధునిక సాంకేతిక ప్రపంచంలో అందుబాటులో ఉన్న డిజిటల్‌ మార్కెటింగ్‌ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే రైతులు సుస్థిర ఆదాయం పొందవచ్చని కలెక్టర్‌ ఎస్‌.డి…ల్లీరావు అన్నారు. ఏపీ నాబార్డు, ఎస్‌ఎఫ్‌ఏసీ, ఓఎన్‌డీసీ భాగస్వామ్యంతో ‘తరంగ్‌’ పేరుతో పటమట స్టెల్లా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంస్థల ప్రదర్శనను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాబార్డు రైతులకు కేవలం రాయితీలు ఇచ్చి వదిలేయకుండా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించి లాభాలు ఆర్జించేలా చేస్తుందని చెప్పారు. ఈ నెల 24 వరకు జరిగే ప్రదర్శనకు ప్రజలు, అధికారులు తరలివచ్చి రైతులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అనంతరం నాబార్డు జీఎం కె.వి.ఎస్‌.ప్రసాద్‌, డీజీఎం అబువరాజన్‌ తదితరులతో కలిసి స్టాళ్లను సందర్శించారు. నాబార్డు డీజీఎం చంద్రమూర్తి, నాబార్డు ఎన్టీఆర్‌ జిల్లా అధికారి చౌసాల్కర్‌, స్మాల్‌ఫార్మర్స్‌ అగ్రీ బిజినెస్‌ కన్సార్టియం ప్రతినిధి కుల్‌వీర్‌ సింగ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా డీజీఎం చందన్‌ సాహు, కెనరా బ్యాంకు డివిజనల్‌ మేనేజర్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని