logo

అనిశా వలలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌

అల్పాహారం బండి ఏర్పాటుకు లైసెన్స్‌ ఇచ్చేందుకు రూ.8 వేలు లంచం తీసుకుంటూ అవనిగడ్డ పంచాయతీ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పవన్‌ కుమార్‌ గురువారం అనిశా అధికారులకు పట్టుబడ్డారు.

Published : 23 Feb 2024 05:31 IST

పట్టుబడిన పవన్‌కుమార్‌

అవనిగడ్డ, న్యూస్‌టుడే: అల్పాహారం బండి ఏర్పాటుకు లైసెన్స్‌ ఇచ్చేందుకు రూ.8 వేలు లంచం తీసుకుంటూ అవనిగడ్డ పంచాయతీ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పవన్‌ కుమార్‌ గురువారం అనిశా అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. అల్పాహరం బండి ఏర్పాటుకు అనుమతుల కోసం అవనిగడ్డకు చెందిన ఆకుల సాయికుమార్‌ అనే యువకుడు కొంత కాలంగా పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగారు. ఈ మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రూ.8000 కోరడంతో చేసేదిలేక అనిశా అధికారులను ఆశ్రయించాడు. దీంతో అనిశా అదనపు ఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో అధికారులు వలపన్ని గురువారం లంచం తీసుకుంటుండగా పవన్‌కుమార్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సాయికుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

9 నెలల సెలవులో ఉన్న పవన్‌కుమార్‌, 2023 నవంబర్‌ 23న తిరిగి విధుల్లో చేరి గురువారం అనిశా అధికారులకు పట్టుబడ్డారు. పంచాయతీ కార్యాలయంలో అనిశా అధికారులు దాడులు చేయడం ఇటీవల కాలంలో ఇదే మొదటి సారి. గతంలో మోపిదేవి ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ను పట్టుకున్నారు. అంతకు మందు నాగాయలంక తహసీల్దార్‌ కార్యాలయానికి చెందిన ఉద్యోగిని అవనిగడ్డలో కోర్టు ఎదురుగా గల డ్రింక్‌ షాపులో పట్టుకున్నారు. ఈ మూడు కేసులు సుమారు ఏడాది లోపు నమోదైనవే కావడం విశేషం. ఈ దాడుల్లో ఇన్‌ఛార్జి డీఎస్పీ ప్రతాప్‌, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌, నాగరాజు, సత్యనారాయణ, సురేష్‌, రవికుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని