logo

శోభాయమానం.. ఆది దంపతుల గిరిప్రదక్షిణం

శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని ఆది దంపతుల గిరిప్రదక్షిణ శనివారం శోభాయమానంగా జరిగింది

Updated : 25 Feb 2024 06:58 IST

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని ఆది దంపతుల గిరిప్రదక్షిణ శనివారం శోభాయమానంగా జరిగింది. అర్చకులు గంగా, పార్వతీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో రామారావు, ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ రాంబాబు కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మంగళవాయిద్యాలు, డప్పు నృత్యాల నడుమ ఊరేగింపు కుమ్మరిపాలెం సెంటరు, చెరువు సెంటరు, చిట్టినగర్‌, బ్రాహ్మణ వీధి మీదుగా మల్లికార్జున మహామండపానికి చేరింది. దారి పొడవునా భక్తులు హారతులిచ్చి స్వాగతం పలికారు. ప్రదక్షిణ అనంతరం భక్తులు స్వర్ణకవచాలాంకృత దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈఈ కోటేశ్వరరావు, స్థానాచార్య శివప్రసాద శర్మ, ఏఈవో చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.  

ప్రసాదం అందక ఉసూరుమన్న భక్తులు..

 చిట్టినగర్‌, న్యూస్‌టుడే: పురవీధుల్లో అమ్మవారి దర్శించుకున్న భక్తులకు ప్రసాదం అందక తీవ్ర నిరాశకు గురయ్యారు. ఊరేగింపు గుడి నుంచి కబేళా సెంటర్‌ వరకు వచ్చే సరికే ప్రసాదం అయిపోయిందని అర్చకులు చెబుతున్నారు. ప్రదక్షిణ సగం కూడా పూర్తికాకముందే ప్రసాదం లేకుండా చేస్తే ఎలా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అందరికీ ప్రసాదం అందేలా ఈవో చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని