logo

పరస్పరదాడుల కేసులో 21 మందికి జైలు

అయిదేళ్ల నాటి పరస్పరదాడుల కేసులో న్యాయస్థానం 21 మందికి జైలుశిక్ష, జరిమానా విధించడంతో నిందితులందర్నీ నెల్లూరు జైలుకు తరలించారు

Published : 25 Feb 2024 05:43 IST

నిందితులు అందర్నీ నెల్లూరు జైలుకు తరలింపు

 గాజులపాడు (గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: అయిదేళ్ల నాటి పరస్పరదాడుల కేసులో న్యాయస్థానం 21 మందికి జైలుశిక్ష, జరిమానా విధించడంతో నిందితులందర్నీ నెల్లూరు జైలుకు తరలించారు. నందివాడ ఎస్‌ఐ చంటిబాబు తెలిపిన వివరాల ప్రకారం నందివాడ మండలం గాజులపాడులోని సొసైటీ చెరువుల విషయమై వివాదం ఏర్పడటంతో 2019 జూన్‌ 17 రాత్రి గ్రామానికి చెందిన సొసైటీ సభ్యులు రెండు పార్టీల వర్గీయులుగా ఏర్పడి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక వర్గీయులు 17 మంది, మరో వర్గానికి చెందిన అయిదుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నాటి నుంచి దీనిపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం గుడివాడ సెషన్స్‌ కోర్టులో తుది విచారణ జరిగి అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి పూర్ణిమ ఒక వర్గానికి చెందిన ఐదుగురికి ఒక్కొక్కరికి రెండేళ్ల 11 నెలల జైలు, రూ. 5 వేల జరిమానా, మరో వర్గానికి చెందిన 17 మందికి ఒక్కొక్కరికి మూడేళ్ల ఒక నెల జైలు, రూ. 5 వేల జరిమానా విధించారు. వారిలో ఒకరికి అనారోగ్యం కారణంగా బెయిల్‌ మంజూరు చేశారు. మిగిలిన 21 మందిని శనివారం నెల్లూరు జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ చంటిబాబు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు