logo

గన్నవరం నుంచి శాసనసభలో అడుగు పెడతా

తెదేపాకు కంచుకోట వంటి గన్నవరం నియోజకవర్గంలో గెలిచి నారా భువనేశ్వరికి కానుకగా అందిస్తానని యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు.

Published : 25 Feb 2024 05:55 IST

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: తెదేపాకు కంచుకోట వంటి గన్నవరం నియోజకవర్గంలో గెలిచి నారా భువనేశ్వరికి కానుకగా అందిస్తానని యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. శనివారం తెదేపా-జనసేన మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో, గన్నవరం తెదేపా సీటుని యార్లగడ్డకు కేటాయిస్తూ చంద్రబాబు ప్రకటించగానే పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఆ సమయంలో హనుమాన్‌జంక్షన్‌లోనే ఉన్న ఆయన స్థానిక అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, తనపై నమ్మకంతో చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌కల్యాణ్‌ సీటు ఖరారు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. గన్నవరం నుంచి శాసనసభకు వస్తానని సీఎం జగన్‌తో సవాల్‌ చేశానని, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరతానన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, అండదండలు తనకు ఉన్నాయన్నారు. జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్‌, నాయకులు వేగిరెడ్డి పాపారావు, గుండపనేని ఉమాప్రసాద్‌, మూల్పూరి కల్యాణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నీటి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ నేతృత్వంలో పలువురు నాయకులు, కార్యకర్తలు వీరవల్లి వద్ద యార్లగడ్డను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

కొల్లు రవీంద్రకు ఘన స్వాగతం

 మచిలీపట్నం, కార్పొరేషన్‌ : మచిలీపట్నం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కొల్లు రవీంద్రను పార్టీ అధిష్టానం ప్రకటించిన అనంతరం నగరానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బందరు మండంలోని సుల్తాన నగరం గ్రామం వద్ద నాయకులు ఆయన్ను గజమాలతో సత్కరించారు. అనంతరం అక్కడి నుంచి నగరంలోని ఆయన ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలకు రవీంద్ర అభివాదం చేస్తూ..మాట్లాడుతూ వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు