logo

దశ దిశలా సమరోత్సాహం

ఒక నియోజకవర్గం మినహా దాదాపుగా ఇన్‌ఛార్జులనే తెదేపా అభ్యర్థులుగా ప్రకటించింది. జనసేన అభ్యర్థులను ప్రకటించలేదు. రెండింటా అభ్యర్థులను ప్రకటించకపోవడం చర్చనీయాంశమైంది.

Updated : 25 Feb 2024 08:06 IST

అనుభవజ్ఞులకే తెదేపా టికెట్లు

ఒక నియోజకవర్గం మినహా దాదాపుగా ఇన్‌ఛార్జులనే తెదేపా అభ్యర్థులుగా ప్రకటించింది. జనసేన అభ్యర్థులను ప్రకటించలేదు. రెండింటా అభ్యర్థులను ప్రకటించకపోవడం చర్చనీయాంశమైంది. మరో రెండు జనసేనకు కేటాయించినట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో రెండేసి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.


 మచిలీపట్నం ఆభ్యర్ధి కొల్లు రవీంద్ర ( 52) బి.ఎ. ఎల్‌ఎల్‌బీబీ భార్య నీలిమ, గృహిణి, ఇద్దరు పిల్లలు

 వ్యాపారం బీ కొల్లు రవీంద్ర సోదరి భర్త నడకుదిటి నరసింహారావు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేశారు. ఆయన కుమార్తె నీలిమనే రవీంద్ర పెళ్లి చేసుకున్నారు. మామ ప్రోత్సాహంతో 2005లో తెదేపాలో చేరారు. 2007లో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా.. 2009లో మచిలీపట్నం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడారు. 2014లో గెలిచి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2019లో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు. బీసీ సాధికార కమిటీ ఛైర్మన్‌. 2015 నుంచి కొల్లు ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలు.


గన్నవరం యార్ల గడ్డ వెంకట్రావు (49) భార్య జ్ఞానేశ్వరి, కుమారుడు, కుమార్తె

 అమెరికా, భారత్‌లో వ్యాపారాలు బీ 2017 నవంబరులో గన్నవరం వైకాపా సమన్వయకర్తగా రాజకీయాల్లో ప్రవేశం. 2019 ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసి ఓటమి. తర్వాత గన్నవరం వైకాపా ఇన్‌ఛార్జిగా ఆరు నెలలు కొనసాగారు. ఆపై కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌గా ఉన్నారు. 2023 ఆగస్టులో తెదేపాలో చేరగా... గన్నవరం ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు.


వెనిగండ్ల రాము(53) బీటెక్‌ భార్య సుఖద, ఇద్దరు కుమార్తెలు

 వ్యాపారం 2022లో తెదేపాలో చేరి వెనిగండ్ల ట్రస్ట్‌ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో కూడా క్రియాశీలకంగా పాల్గొంటున్నారు.


పామర్రు వర్ల కుమార్‌ రాజా (46)బీటెక్‌, ఎంఐటీ(యూఎస్‌ఏ) భార్య విశ్రమ, కుమార్తె, కుమారుడు

వ్యాపారం  తెదేపా సీనియర్‌ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కుమారుడు. కుమార్‌రాజా 2008లో తెదేపాలో చేరారు. 2021లో నియోజకవర్గ బాధ్యతలు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ పార్టీకి, ప్రజలకు తనవంతు సేవచేస్తున్నారు.


పెడన కాగిత కృష్ణ ప్రసాద్‌(41) బీటెక్‌, ఈసీఈ

  •  తండ్రి: కాగిత వెంకట్రావు మాజీ ఎమ్మెల్యే, భార్య: శిరీష, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, కుమారుడు
  •  వృత్తి: గతంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌
  •  తండ్రి వెంకట్రావు 1983 నుంచి తెదేపాలో ఉన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, తితిదే ఛైర్మన్‌గా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా చేశారు. 2019 ఎన్నికల్లో తెదేపా టికెట్‌పై పోటీ చేసిన కృష్ణప్రసాద్‌ జోగి రమేష్‌ చేతిలో ఓడిపోయారు.

    పోరాట పటిమతో..

బందరులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను మరోసారి అవకాశం వరించింది. యువకుడిగా మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా పార్టీలో గుర్తింపు పొందారు. 2019లో ఓడాక ఆయనపై పలు కేసులు నమోదు చేశారు. బందరులో హత్యానేరం మోపి దాదాపు 90 రోజులు సెంట్రల్‌ జైలులో ఉంచారు. అప్పటి మంత్రి పేర్ని నానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ప్రస్తుతం ప్రత్యర్థిగా నాని తనయుడు కిట్టు ఉన్నారు.


మరోసారి సై

గన్నవరం ఇన్‌ఛార్జి యార్లగడ్డ వెంకట్రావుకు టికెట్‌ లభించింది. గత ఎన్నికల్లో ఆయన వైకాపా నుంచి పోటీ చేసి ఓడిపోగా.. తెదేపా నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే వంశీ వైకాపాలో చేరడంతో వెంకట్రావుకు పొసగలేదు. తనకు ప్రాధాన్యం లేదని భావించి పార్టీ మారారు. మరోసారి ఇద్దరూ ప్రత్యర్థులుగా ఢీకొనే వీలుంది. ఏడు జాబితాలు ప్రకటించిన వైకాపా వంశీకి ఇంకా టికెట్‌ ఖరారు చేయలేదు. ఆయన మైలవరం, పెనమలూరు వెళ్తారని ప్రచారాలు సాగుతున్నాయి.


సామాజిక సమతూకం

గుడివాడ ఇన్‌ఛార్జిగా ఇప్పటికే ప్రకటించిన ప్రవాసాంధ్రుడు (ఎన్నారై) వెనిగండ్ల రాముకే టికెట్‌ ఇచ్చారు. గత రెండేళ్లుగా సేవాకార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, రాము సమష్టిగా పనిచేస్తున్నారు. రాము అమెరికాలో వ్యాపారాలు నిర్వహిస్తుండగా, ఆయన భార్య స్థానికురాలు. కులాంతర వివాహం చేసుకున్న వీరికి సామాజిక వర్గాలు అదనపు బలం కానున్నాయని అంచనా. మరోవైపు ఎమ్మెల్యే కొడాలి సీటు మారుతుందనే ప్రచారం జోరుగా ఉంది. సర్వేలో ప్రతికూలతలు వచ్చినట్లు ఐప్యాక్‌ నివేదించినట్లు సమాచారం.


మాటకు కట్టుబడి

పామర్రుకు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తనయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి కుమార్‌రాజాను ఖరారు చేశారు. ఈస్థానం పలువురు ఆశించినా.. గతంలో ఇచ్చిన హామీ మేరకు రాజాకే టికెట్‌ ఇచ్చారు. వైకాపా ఎమ్మెల్యే కైలేకు ఈసారి టికెట్‌ దక్కే వీలున్నా ఇంకా ప్రకటించకపోవడం విశేషం.


కాగిత వైపే మొగ్గు

పెడన ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాద్‌ను రంగంలోకి దిగనున్నారు. ఈ స్థానంపై పలువురు ఆశలు పెట్టుకున్నారు. వైకాపా నుంచి తెదేపాలోకి వచ్చిన మాజీ డిప్యూటీ స్పీకరు వేదవ్యాస్‌ ఆశించారు. ఆయన పేరు ప్రకటించకపోవడంతో షాక్‌కు గురై ఆస్పత్రి పాలయ్యారు. పెడన జనసేనకు కేటాయిస్తారని భావించారు. బందరు ఎంపీగా పోటీ చేసిన తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకొళ్ల కూడా ఆశించినా..  


విజయవాడ తూర్పు(65) అభ్యర్థి: గద్దె రామ్మోహన్‌ ఎమ్మెస్సీ

 భార్య గద్దె అనురాధ, ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పని చేశారు. ఇద్దరు కుమారులు. వ్యాపారం 1994లో గన్నవరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత తెదేపాలో చేరారు. 1999లో విజయవాడ ఎంపీగా విజయం సాధించారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు.


విజయవాడ సెంట్రల్‌ బొండా ఉమామహేశ్వరరావు(58) భార్య సుజాత, ఇద్దరు కుమారులు

 ఐరన్‌ వ్యాపారం బీ 2004లో తెదేపాలో చేరిక. 2009 విజయవాడ తూర్పు టికెట్‌ ఇచ్చినా.. పరిస్థితుల నేపథ్యంలో ఆ సీటు గద్దె రామ్మోహన్‌కు కేటాయించినా పార్టీలో కొనసాగారు. 2010లో విజయవాడ సెంట్రల్‌ ఏర్పడిన నాటి నుంచి ఇన్‌ఛార్జిగా ఉన్నారు. 2014లో సెంట్రల్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక. 2019లో ఓటమి. తెదేపా అధికార ప్రతినిధిగా, ఉపాధ్యక్షుడిగా చేశారు. ప్రస్తుతం తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు.


తంగిరాల సౌమ్య (43)నందిగామ బీటెక్‌

భర్త మోహనరావు సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌, ఇద్దరు పిల్లలుబీ రాజకీయాలకు రాక ముందు సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌  మాజీ ఎమ్మెల్యే
తంగిరాల ప్రభాకరరావు కుమార్తె. 2014 ఎన్నికల్లో రెండోసారి ప్రభాకరరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకుండానే మృతి చెందారు. ఆయన మృతితో సౌమ్య 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం ఉప ఎన్నికలో గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.


జగ్గయ్యపేట(59) శ్రీరామ్‌ రాజగోపాల్‌ బీకాం  భార్య శ్రీదేవి, కుమారుడు, కుమార్తె
 రవాణా, రైసు మిల్లుల వ్యాపారంఎంఏ, పీహెచ్‌డీ
ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుడిగా పని చేశారు. 20 ఏళ్లు జగ్గయ్యపేట పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. మున్సిపల్‌ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు.


తిరువూరు కొలికపూడి శ్రీనివాసరావ (55) ఎంఏ, పీహెచ్‌డీ భార్య మాధవి,

తెలంగాణ సచివాలయ ఉద్యోగిని, ఒక కుమార్తె  27 ఏళ్ల కిందట హైదరాబాద్‌లో కేఎస్‌రావు ఐఏఎస్‌ అకాడమీ స్థాపించి డైరెక్టర్‌గా వ్యవహరించారు. గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్‌ బీ ఇటీవల తెదేపాలో చేరిక. అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా, అమరావతి జేఏసీ కన్వీనర్‌గా నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్నారు.


శీఘ్రమేవ..హ్యాట్రిక్‌భవ

తూర్పు నుంచి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మరోసారి పోటీ చేయనున్నారు. ఈసారి స్థానం మారుస్తారని ప్రచారం జరిగినా.. టికెట్‌ ఆయనకే దక్కింది. తూర్పు నుంచి ఈసారి ఆయన గెలిస్తే.. హ్యాట్రిక్‌ సాధించినట్లే. తెదేపాలో సీనియరు సభ్యుడిగా గుర్తింపు ఉంది. మరోసారి తనపై నమ్మకం ఉంచి టికెట్‌ కేటాయించడంపై ఎమ్మెల్యే రామ్మోహన్‌ ఆనందం వ్యక్తం చేశారు. అధినేత బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వైకాపా ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇన్‌ఛార్జి అవినాష్‌కు దాదాపు టికెట్‌ ఖరారని చెబుతున్నారు.


సత్తా చాటేలా..

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న బొండా ఉమా నియోజకవర్గ ఇన్‌ఛార్జిగానూ ముమ్మరంగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. 2014లో తొలిగా గెలిచిన ఆయన 2019లో 25 ఓట్ల తేడాతో ఓడారు. ఈ దఫా సెంట్రల్‌ టికెట్‌ వంగవీటి రాధా అడుగుతున్నారని ఆయనకు ఇచ్చే వీలుందని ప్రచారం జరిగినా ఉమాకే ఇచ్చారు. సామాజిక సమీకరణాలు ఇక్కడ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైకాపా నుంచి పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుని ఇక్కడికి దిగుమతి చేశారు.


ప్రజలతో మమేకం

నందిగామ ఇన్‌ఛార్జి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకే టికెట్‌ ఇచ్చారు. తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో కమిటీలో సభ్యురాలుగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఇసుకపై పోరాటాలు చేశారు. ప్రతిసమస్యపై ప్రజలతో మమేకమై ఆందోళనలు నిర్వహించారు. నందిగామలోనూ వైకాపా టికెట్‌ ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుత ఎమ్మెల్యేగా మొండితోక జగన్మోహనరావు ఉన్నారు. మరికొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు.


తాతయ్యా..మెరవాలయ్యా

జగ్గయ్యపేటలో మొదటి నుంచి శ్రీరాం తాతయ్యకే దక్కుతుందని ప్రచారం జరిగింది. సామాజిక సమీకరణాల కోటాలో శ్రీరాం తాతయ్యకు ఇస్తూ వస్తున్నారు. ఇక్కడ వైకాపా టికెట్‌ ఇంకా ప్రకటించలేదు. విప్‌ సామినేని ఉదయభాను రంగంలో ఉండే వీలుంది. ఆయన పార్టీ మారతారనే ప్రచారం బాగా జరిగింది.


అమరావతి స్ఫూర్తికి వందనం

తెదేపా టికెట్‌ కొలికపూడి శ్రీనివాసరావుకు దక్కింది. అమరావతి ఉద్యమంలో చురుకుగా వ్యవహరించిన శ్రీనివాసరావుకు అవకాశం ఇచ్చారు. గతంలో ఇక్కడ టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు తనకు దక్కదని తెలిసి వైకాపాలో చేరారు. అక్కడ ఆయనకు టికెట్‌ ఖరారు చేశారు. రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే రక్షణనిధికి వైకాపా టికెట్‌ ఇవ్వకపోవడం అసంతృప్తులు రగిలాయి. మరోవైపు తెదేపా ఇన్‌ఛార్జి శ్యావల దేవదత్‌కు తెదేపా టికెట్‌ ఇవ్వలేదు. సమీకరణలు మారినందున ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారనుంది.

- ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని