logo

బహుజనులకు అవకాశాలివ్వాలి

రాష్ట్రంలో ప్రభుత్వం మారాలంటే బహుజనులకు అవకాశాలు కల్పించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య కోరారు. చట్టసభల్లో తమకు అవకాశం కల్పిస్తే.. రాష్ట్రంలో దళితుల ఆత్మగౌరవం, రాజధాని అమరావతి కోసం పని చేస్తామని స్పష్టం చేశారు.

Published : 29 Feb 2024 05:15 IST

గాంధీనగర్‌: రాష్ట్రంలో ప్రభుత్వం మారాలంటే బహుజనులకు అవకాశాలు కల్పించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య కోరారు. చట్టసభల్లో తమకు అవకాశం కల్పిస్తే.. రాష్ట్రంలో దళితుల ఆత్మగౌరవం, రాజధాని అమరావతి కోసం పని చేస్తామని స్పష్టం చేశారు. బుధవారం ఆయన విజయవాడలో మాట్లాడారు. రాజధాని ఉద్యమంతో పాటు దళితులపై జరిగిన దాష్టీకాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించిన ఉద్యమకారులకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చి గౌరవించాలని తెదేపా అధినేత చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ కులాల కార్చిచ్చు రగులుతూనే ఉందని, సామాజిక కులాలకు సమ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఈ కార్చిచ్చును ఆపవచ్చని పేర్కొన్నారు. ప్రతినిధులు కనకం శ్రీనివాసరావు, శిరంశెట్టి పూర్ణచంద్రరావు, సరిత, పెరుమాళ్ల తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని