logo

రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అరగంట ముందే విద్యార్థులు కేంద్రాలకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.

Published : 29 Feb 2024 05:52 IST

కేంద్రాలకు అరగంట ముందే రావాలి
సీసీ కెమెరాలతో పటిష్ఠ నిఘా

కంచికచర్ల, న్యూస్‌టుడే: ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అరగంట ముందే విద్యార్థులు కేంద్రాలకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. హాల్‌టికెట్లను ఇప్పటికే ప్రిన్సిపల్స్‌ లాగిన్లలో ఉంచారు. తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తాడేపల్లిలోని ఇంటర్‌ బోర్డు, విజయవాడలోని డీఐఈవో కార్యాలయాలకు అనుసంధానం చేశారు.

75,576 మంది విద్యార్థులు

ఎన్టీఆర్‌ జిల్లాలో 99 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి, రెండో ఏడాది విద్యార్థులు కలిపి 75,576 మంది హాజరుకానున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. 17స్టోరేజీ పాయింట్ల నుంచి ప్రశ్నాపత్రాలను కేంద్రాలకు తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బల్లలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేటు పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. 99 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్‌ అధికారులు, 03 సిట్టింగ్‌, 05 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, ఇన్విజిలేటర్లు, కేంద్రాలను పర్యవేక్షించనున్నారు. పరీక్షలకు విద్యార్థులు సకాలంలో హాజరయ్యేలా ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా డీఐఈవో  సి.ఎస్‌.ఎస్‌.ఎన్‌.రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులతో పాటు సిబ్బంది కేంద్రాల్లోకి చరవాణి తీసుకెళ్లడానికి వీల్లేదు. చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఒక్కరికే కీప్యాడ్‌ ఫోన్‌ అనుమతిస్తారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్‌ వస్తువులను లోపలికి తీసుకెళ్లకూడదు. ఫిర్యాదులుంటే 7075136947 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు.’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని