logo

వెలంపల్లీ.. మరచితివేమి?!

గాంధీజీ నడయాడిన ప్రదేశమది. దానికి చిహ్నంగా కొండపై గాంధీ బొమ్మతో స్తూపాన్ని, మ్యూజియాన్ని నిర్మించారు. ఈ ప్రాంత సందర్శనకు పర్యాటకులు పెద్దఎత్తున వస్తుంటారు. కానీ నక్షత్రశాల మూసి రెండేళ్లవుతోంది.

Published : 29 Feb 2024 05:34 IST

స్తూపంపై గాంధీజీ సూక్తులు చెదిరిపోయి...

ఈనాడు, అమరావతి: గాంధీజీ నడయాడిన ప్రదేశమది. దానికి చిహ్నంగా కొండపై గాంధీ బొమ్మతో స్తూపాన్ని, మ్యూజియాన్ని నిర్మించారు. ఈ ప్రాంత సందర్శనకు పర్యాటకులు పెద్దఎత్తున వస్తుంటారు. కానీ నక్షత్రశాల మూసి రెండేళ్లవుతోంది. మ్యూజియాన్ని పడగొట్టి కొండ కింద భవనాన్ని నిర్మించి నెలలు గడుస్తున్నా ప్రారంభించలేదు. గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడమే కారణం. రైలు ఎక్కి నగర అందాలను తిలకిద్దామన్నా ఇంజిన్‌ పాడై నాలుగు నెలలైంది. చిన్నారులు ఆడుకునే సామగ్రి దెబ్బతింది. స్తూపం చుట్టూ కళాకృతులు, గాంధీజీ సూక్తులు దెబ్బతిన్నా స్పందన లేదు. స్తూపంపై ఆకతాయిలు పిచ్చి రాతలు రాస్తున్నారు. గతంలో గాంధీ కొండను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన వెలంపల్లి విస్మరించిన వేళ ప్రజలకు నిరాశే మిగిలింది.

దేశ సంస్కృతిని తెలిపే కళాకృతులు పాడైపోతూ, మొక్కలు మొలిచి ఇలా..

ఆకతాయిలు విరగ్గొట్టిన విద్యుద్దీపాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని