logo

వైకాపాను సాగనంపుదాం

వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టి నాటి నుంచి అనుభవిస్తున్న కష్టాలను గుర్తుచేసుకుని రాబోయే ఎన్నికల్లో తగు గుణపాఠం చెప్పేందుకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు.

Published : 02 Mar 2024 04:11 IST

శంఖారావ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి కొల్లు

సమావేశంలో మాట్లాడుతున్న రవీంద్ర, వేదికపై తెదేపా నాయకులు

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టి నాటి నుంచి అనుభవిస్తున్న కష్టాలను గుర్తుచేసుకుని రాబోయే ఎన్నికల్లో తగు గుణపాఠం చెప్పేందుకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన శంఖారావ సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిగూడెం తెదేపా, జనసేన సభతో తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు మొదలయ్యిందన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో దాదాపు రూ.2000 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా గత ఎన్నికల సందర్భంగా వాటిని సక్రమంగా ప్రజలకు వివరిచలేకపోయామనీ, అటువంటి లోపాలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. స్థానిక శానసభ్యుడు పేర్ని నాని నెల రోజుల వ్యవధిలో ఎన్నికలు ఉండగా ఇప్పుడు శంకుస్థాపనల పేరుతో హడావుడి చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి బందరు అభివృద్ధి కోసం రూ.20 కోట్లు ఇచ్చారంటూ డప్పాలు కొడుతున్న పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టూ ఇప్పటి వరకూ ఏంచేశారంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కార్యకర్తల పోరాటమే గెలుపుకు నాంది కావాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో పాల్గొన్న పార్టీ నాయకులు కొనకళ్ల జగన్నాధరావు(బుల్లయ్య), బాబాప్రసాద్‌, గొర్రెపాటి గోపిచంద్‌, తదితరులు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అవినీతి, అరాచక పాలనను ప్రజల్లో విస్తృతంగా ఎండగట్టాలని కోరారు. నాయకులు కాగిత వెంకటేశ్వరరావు, లంకె నారాయణప్రసాద్‌, ఇలియాస్‌ పాషా, వెంకన్న, నాని, వాలిశెట్టి తిరుమలరావు, పల్లపాటి సుబ్రహ్మణ్యం, తదితరులతో పాటు కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని