logo

మూడేళ్లయినా.. గృహ యోగమేదీ జగన్‌?

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ కేంద్రంలోని పామర్రులో నిరుపేదలకు స్థలాలు, ఇళ్ల నిర్మాణం కోసం 2019లో ఉరుటూరు వద్ద ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమి ఇది.

Published : 02 Mar 2024 04:12 IST

పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాల్సిన భూమి

ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ కేంద్రంలోని పామర్రులో నిరుపేదలకు స్థలాలు, ఇళ్ల నిర్మాణం కోసం 2019లో ఉరుటూరు వద్ద ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమి ఇది. సుమారు 2వేల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సుమారు 30 ఎకరాల భూమిని అధికారులు కొనుగోలు చేశారు. ఇందులో కొంత భూమికి సంబంధించి న్యాయ సమస్యలు ఉండడంతో లేఔట్‌ పనులు ఆపేశారు.  ఏడాది కిందట కోర్టు సమస్య కొలిక్కిరాగా లేఔట్లో బుసక తోలి మెరక చేశారు. హద్దు రాళ్లు పాతి లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాల్సి ఉంది. ఏడాదిగా ఇక్కడ పనులు మొదలు కాలేదు. లేఔట్లో పాతేందుకు తెచ్చిన సిమెంటు దిమ్మెలు విరిగిపోయి కనిపిస్తున్నాయి. సీఎం జగన్‌ పామర్రుకు వచ్చినా ఇళ్ల స్థలాల గురించి కనీసం ప్రస్తావించ లేదు. ఇక్కడి నిరుపేదలకు గృహయోగం కలగానే మిగిలింది.

విరిగిపోయిన సర్వే రాళ్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని