logo

వాలంటీర్ల ప్రచారంపై తెదేపా ఫిర్యాదు

ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పట్టణ పరిధి 16వ వార్డులో పనిచేస్తున్న వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ లోవరాజుకు తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు.

Published : 02 Mar 2024 04:17 IST

వైకాపా నాయకుడు స్వామిదాసుతో కలిసి ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు (వృత్తంలో)

తిరువూరు, న్యూస్‌టుడే: ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పట్టణ పరిధి 16వ వార్డులో పనిచేస్తున్న వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ లోవరాజుకు తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. ఈమేరకు స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో శుక్రవారం ఆయనకు వినతిపత్రం అందజేశారు. వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి నల్లగట్ల స్వామిదాసు, నాయకులతో కలిసి వార్డులో ఎన్నికల ప్రచారం చేస్తూ వాలంటీర్లు లబ్ధిదారులకు పింఛన్‌ డబ్బులు పంపిణీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను ఖాతరు చేయకుండా బాహాటంగానే వైకాపాకు అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల 103వ బూత్‌ వైకాపా కన్వనర్ల సమావేశంలో పాల్గొన్న వాలంటీర్లపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. వైకాపాకు క్రియాశీలకంగా పనిచేస్తున్న పది మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించాలని, లేని పక్షంలో సచివాలయం ఎదుట ధర్నాలు చేస్తామని తెలిపారు. కమిషనర్‌ను కలిసిన వారిలో తెదేపా కౌన్సిలర్‌ జీడిమళ్ల సత్యవతి, నాయకులు ఉదారపు మార్కండేశ్వరరావు, పులి రాజశేఖర్‌, మారేపల్లి వంశీ, ఆళ్లపాటి గంగరాజు, సోమవరపు శ్రీనివాసరావు, మండేపూడి రామకృష్ణ, షేక్‌ అహ్మద్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని