logo

విధేయులనే వరించిన టికెట్లు!

పార్టీకి కష్టకాలంలో విధేయులుగా ఉన్న వారికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు లభించాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 14 శాసనసభ స్థానాలకు తొమ్మిది చోట్ల కాంగ్రెస్‌(ఐ) పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.

Published : 03 Apr 2024 05:05 IST

కాంగ్రెస్‌ తొలి జాబితాలో 9 మందికి స్థానం

 గన్నవరం బరిలో మిత్రపక్షం సీపీఐ..?

ఈనాడు, అమరావతి: పార్టీకి కష్టకాలంలో విధేయులుగా ఉన్న వారికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు లభించాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 14 శాసనసభ స్థానాలకు తొమ్మిది చోట్ల కాంగ్రెస్‌(ఐ) పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా లోక్‌సభ స్థానాలకు ప్రకటించలేదు. మాజీ ఉపముఖ్యమంత్రి కోనేరు రంగారావు కూతురుకు టికెట్‌ లభించడం విశేషం. ఆది నుంచి కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన వారికే అవకాశాలు లభించాయి.

కృష్ణా జిల్లాలో..!

పెనమలూరు నుంచి కానూరుకు చెందిన ఎలిసెల సుబ్రహ్మణ్యంకు టికెట్‌ ఇచ్చారు. రిజర్వుడు సామాజికవర్గానికి చెందిన ఆయనకు జనరల్‌ స్థానం కేటాయించారు. మాజీ ఎమ్మెల్యే డి.వై.దాస్‌కు పామర్రు కేటాయించారు. ఆయన గతంలో ఇక్కడ పోటీ చేసి గెలుపొందారు. ఆయనకు వ్యక్తిగతంగా నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. గుడివాడ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన వడ్దాది గోవిందరావు, అలియాస్‌ రాజేష్‌కు కేటాయించారు. వడ్డాది చారిటబుల్‌ ట్రస్టు పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం డీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మచిలీపట్నం అభ్యర్థిగా మైనార్టీ వర్గానికి చెందిన అబ్దుల్‌ మతీన్‌ను ఎంపిక చేశారు. నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో పెడన నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా పనిచేశారు. అవనిగడ్డ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా అందె శ్రీరాంమూర్తిని ఎంపిక చేశారు. 2011 నుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. 2019లో పోటీ చేశారు. ప్రస్తుతం మళ్లీ టికెట్‌ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గానికి ఎంపిక చేయాల్సి ఉంది. మిత్రపక్షం సీపీఐకి కేటాయించే అవకాశం ఉందని తెలిసింది. మచిలీపట్నం లోక్‌సభకు కాంగ్రెస్‌ కృష్ణ పేరు తెరమీదకు వచ్చింది. కానీ జాబితాలో మచిలీపట్నం ప్రకటించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు