logo

రానున్న ఎన్నికల్లో కూటమిదే గెలుపు

రాబోయే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమిదే విజయమని మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ కూటమి అభ్యర్థి, ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు.

Published : 03 Apr 2024 05:16 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ బాలశౌరి
పామర్రు, న్యూస్‌టుడే: రాబోయే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమిదే విజయమని మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ కూటమి అభ్యర్థి, ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. మంగళవారం స్థానిక పాలశీతలీకరణ కేంద్రం కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కూటమి నేతల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ.. వైకాపా చేసిన అరాచక పాలన, అకృత్యాలకు ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. పింఛన్లు ఇవ్వకుండా పేదలను మోసం చేస్తున్నారన్నారు. వాలంటీర్లతో ఓటర్లను భయపెట్టాలన్న జగన్‌ కుట్రలను ఎన్నికల కమిషన్‌ అడ్డుకోవడంతో తెదేపాపై నింద వేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇలాంటి పాలన అంతమొందించేందుకు ప్రజలంతా అడుగు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నియోజకవర్గంలో వందకు పైగా  వైకాపా కుటుంబాలు జనసేనలో చేరాయి. వారికి కండువాలు కప్పి ఎంపీ పార్టీలోకి ఆహ్వానించారు. పామర్రు అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా కూటమి అభ్యర్థి వర్ల కుమార్‌రాజా జనసేన నియోజకవర్గ బాధ్యుడు తాడిశెట్టి నరేష్‌, కుదురవల్లి ప్రవీణ్‌చంద్ర, వల్లూరుపల్లి గణేష్‌, భాజపా నాయకుడు వి.వెంకటేశ్వరరావు, కూనపరెడ్డి సుబ్బారావు, అశోక్‌, గుంపా గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని