logo

స్నానాలు చేయాలన్నా.. ముక్కు మూసుకోవాల్సిందే!

విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు సరైన వసతుల్లేక ఇబ్బంది పడుతున్నారు. తలనీలాలు ఇచ్చేచోట నేలమీద కుప్పలు కుప్పలుగా తలనీలాలు ఉంటున్నాయి.

Published : 22 Apr 2024 05:29 IST

ఈనాడు, అమరావతి: విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు సరైన వసతుల్లేక ఇబ్బంది పడుతున్నారు. తలనీలాలు ఇచ్చేచోట నేలమీద కుప్పలు కుప్పలుగా తలనీలాలు ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం లేదు. స్నానాలు చేసే దుర్గాఘాట్‌లో మెట్లు పాచిపట్టి చెత్త పేరుకుపోయింది. దుర్గాఘాట్లో జల్లు స్నానాలు చేసే ప్రదేశంలో నీరంతా నిల్వ ఉండి దుర్వాసన వేస్తోంది. భక్తులు సాన్నాలు చేసిన నీటినే మళ్లీ నదిలో నుంచి మోటార్లతో తోడి అందిస్తున్నారు. జల్లు స్నానాలకు మంచి నీరు అందించాల్సిన అధికారులు, నాయకులు చేతులెత్తేశారు. భక్తులు నానా అవస్థలు పడుతున్నారు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని