logo

కల్యాణ దుర్గంలో 86.4 మి.మీ వర్షపాతం

కల్యాణదుర్గం నియోజకవర్గంలో 86.4 మి.మీ వర్షపాతం నమోదైంది.

Published : 25 May 2024 13:18 IST

కల్యాణ దుర్గం గ్రామీణం: కల్యాణదుర్గం నియోజకవర్గంలో  86.4 మి. మీ వర్షపాతం నమోదైంది.  పట్టణంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి  విద్యుత్ సబ్‌ స్టేషన్‌లోని పలు కాలనీలో విద్యుత్ స్తంభాలు,  భారీ వృక్షాలు నేలకొరిగాయి. నాగరాజు అనే రైతుకు చెందిన రెండెకరాల అరటిపంట నీటమునిగి రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లింది. కల్యాణదుర్గం మండలంలోని చాపిరి గ్రామంలో సుమారు 10  విద్యుత్ స్తంభాలు, విద్యుత్ నియంత్రికలు కూలి తీగలు తెగిపడ్డాయి. కుందూరు మండలం మలయనూరు, బసాపురం గ్రామాల్లో  ఓ ఇంటి పై పిడుగు పడగా.. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.  బ్రహ్మాసముద్రం మండలంలోని సూగేపల్లి నుంచి కోనాపురం వెళ్లే రోడ్డు వంక వరద ఉద్ధృతికి  కోతకు గురైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు