logo

అధికార పార్టీ నాయకులా.. మజాకా..

శ్రీసత్యసాయి జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఎన్నికల కోసం రాత్రిపూట కర్ణాటక నుంచి చిలమత్తూరు మండలంలోని గ్రామాల మీదుగా మద్యం అక్రమ తరలింపు జోరుగా సాగుతోంది.

Published : 13 Apr 2024 05:09 IST

కర్ణాటక మద్యం అక్రమ రవాణా

అనంతపురం, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఎన్నికల కోసం రాత్రిపూట కర్ణాటక నుంచి చిలమత్తూరు మండలంలోని గ్రామాల మీదుగా మద్యం అక్రమ తరలింపు జోరుగా సాగుతోంది. ఆయన కోసం చిలమత్తూరు మండల ప్రజాప్రతినిధి బంధువు తన కారులో మద్యం తీసుకొస్తుండగా అదే మండల పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుళ్లు సహకరిస్తున్నట్లు సమాచారం. రాత్రిపూట కారులో మద్యం తీసుకొస్తుండగా, ఓ కానిస్టేబుల్‌ వాహనం ముందు ఎస్కార్ట్‌లా ద్విచక్ర వాహనంలో వచ్చేవాడని తెలుస్తోంది. మరో కానిస్టేబుల్‌ ఫోన్‌లోనే మొత్తం ఆపరేట్‌ చేస్తున్నట్లు సమాచారం. చిలమత్తూరు మండలంలోని గ్రామాల మీదుగా మద్యం తరలింపు జరుగుతున్నట్లు తెలుసుకొన్న ఓ పోలీస్‌ అధికారి రెండు రోజుల క్రితం ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. ఆ రోజు పోలీస్‌ కానిస్టేబుల్‌కు చెందిన ద్విచక్ర వాహనంలో ఇతరులు వస్తుండగా, ఆయన వెనుక కారు వచ్చినట్లు గుర్తించార[ు. ఆ కారును మండల ప్రజా ప్రతినిధి బంధువు నడుపుతుండగా, అందులో స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ను గుర్తించి ఫోన్‌ చేశారు. అయినా కానిస్టేబుల్‌ ఫోన్‌ తీయలేదు. మరో వైపు మద్యం తరలిస్తున్న కారును అధికారి తన వాహనంతో వెంబడించారు. వారు కారును అత్యంత వేగంగా నడిపి తప్పించుకొన్నారు. ఇదే విషయాన్ని ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్‌కు పంపాలని కోరినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని