logo

పరీక్షల్లో తప్పినందుకు మనస్తాపం..

ఇంటర్‌ తప్పినందుకు మనస్తాపంతో జిల్లాలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వేర్వేరు చోట్ల ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించారు.

Published : 13 Apr 2024 05:25 IST

విద్యార్థిని బలవన్మరణం
మరో ముగ్గురి ఆత్మహత్యాయత్నం

గుంతకల్లు గ్రామీణం, బసంపల్లి (చెన్నేకొత్తపల్లి), కదిరి పట్టణం, న్యూస్‌టుడే: ఇంటర్‌ తప్పినందుకు మనస్తాపంతో జిల్లాలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వేర్వేరు చోట్ల ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించారు. గుంతకల్లు పట్టణం మిల్లు కాలనీకి చెందిన మొదటి సంవత్సరం విద్యార్థిని (17) ఇంటర్‌ పరీక్షల్లో తప్పినందుకు మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకులు ఆమెను గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. 

ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించారు. చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లిలోకి చెందిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఇంట్లో ఉన్న విష ద్రావకం తాగింది. గమనించిన కుటుంబీకులు ధర్మవరం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉంది.

శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థిని క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విద్యార్థిని నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడంతో కుటుంబ సభ్యులు మందలిస్తారేమోనన్న భయంతో ఆత్మహత్యాయత్నం చేసింది. విద్యార్థినిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నల్లచెరువు మండలానికి చెందిన ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఓ సబ్జెక్టు ఫెయిల్‌ అయిన కారణంతో ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.


రోడ్డు ప్రమాదంలో తెదేపా కార్యకర్త దుర్మరణం

ఒకరికి తీవ్ర గాయాలు

అమరాపురం, న్యూస్‌టుడే: మడకశిరలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అమరాపురం మండలం హాలదపల్లి గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త సతీశ్‌(36) అక్కడికక్కడే మృతి చెందాడు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీ కోసం సతీశ్‌, తన మిత్రుడు అరుణ్‌తో కలిసి ద్విచక్ర వాహనంలో వెళ్లాడు. ర్యాలీ ముగిసిన తరువాత గ్రామానికి వెళుతూ మధుగిరి రోడ్డు పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద డివైడర్‌ను ఢీకొట్టాడు. స్థానికులు 108 వాహనంలో మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలసుకున్న మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్నలు ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రున్ని పరామర్శించారు. అరుణ్‌ను హిందూపురం ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని