logo

గ్రామానికి దారి చూపండి

మండలంలోని గుర్రపుకొండ ఎగువతండా గ్రామ వాసులు మా గ్రామానికి దారి చూపాలని శుక్రవారం కదిరేపల్లి బస్టాండు కూడలిలో ధర్నా చేపట్టారు.

Published : 13 Apr 2024 05:31 IST

కదిరేపల్లి కూడలిలో గుర్రపుకొండ ఎగువతండా వాసుల ధర్నా

బస్టాండు కూడలిలో బైఠాయించి నిరసన తెలుపుతూ..

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని గుర్రపుకొండ ఎగువతండా గ్రామ వాసులు మా గ్రామానికి దారి చూపాలని శుక్రవారం కదిరేపల్లి బస్టాండు కూడలిలో ధర్నా చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి రెండు గంటల పాటు ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో నాలుగు రోడ్ల కూడలిలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రధాన రహదారుల్లో వాహనాలను వదలకపోవడంతో పొలాల గుండా వెళ్లాయి. అమరాపురం నుంచి మడకశిరకు వెళ్తున్న తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డా.సునీల్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే ఈరన్నల దృష్టికి రస్తా సమస్యను తండా వాసులు తీసుకొచ్చారు. 10.30 గంటలకు అక్కడకు చేరుకున్న తహసీల్దార్‌ వెంకటేశ్‌కు సమస్యను వివరించారు. రైతులు, తండా వాసులు ఇరువురికి సంబంధించిన ఏయే పత్రాలు ఉన్నాయో తీసుకొస్తే పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తహసీల్దార్‌ సూచించారు. తండావాసులు ధర్నాను విరమించి వెళ్లిపోయారు.

సమస్యను తహసీల్దార్‌కు వివరిస్తున్న సునీల్‌, మాజీ ఎమ్మెల్యే ఈరన్న

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు