logo

Anantapur: మొదలైన వజ్రాల వేట

వజ్రకరూరులో వజ్రాల వేట మొదలైంది. శుక్రవారం రాత్రి వర్షం కురవడంతో శనివారం ఉదయం పొలాలన్ని వజ్రాలు వెతికే వారితో నిండిపోయాయి. ఇక్కడ దొరికే చిన్న రాయి(వజ్రానికి)కి పెద్ద మొత్తంలో నగదు లభిస్తుంది.

Published : 19 May 2024 05:16 IST

పొలంలో వజ్రాల కోసం వెతుకుతున్నారిలా..

వజ్రకరూరు, న్యూస్‌టుడే: వజ్రకరూరులో వజ్రాల వేట మొదలైంది. శుక్రవారం రాత్రి వర్షం కురవడంతో శనివారం ఉదయం పొలాలన్ని వజ్రాలు వెతికే వారితో నిండిపోయాయి. ఇక్కడ దొరికే చిన్న రాయి(వజ్రానికి)కి పెద్ద మొత్తంలో నగదు లభిస్తుంది. దాంతో కడప, మదనపల్లి, ధర్మవరం, ఆలూరు, చిప్పగిరి, గుంతకల్లు, గుత్తి ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి వజ్రాలను వెతుకుతారు. రాయిని గుర్తు పట్టడానికి వీలుగా కొందరు వ్యాపారులు పరిసర ప్రాంతాల్లోనే తమ మనుషులను ఉంచుతారు. జూన్, జులైలో కురిసే వర్షాలకు జనంతోపాటు ఉద్యోగులు సైతం రాళ్లను వెతకడానికి వస్తుంటారు. దాంతో పొలాలన్నీ జనంతో నిండిపోతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని