logo

పనితీరు మార్చుకోకపోతే చర్యలు

ఉపకారాగారంలో ఉంటున్న కొంత మంది నిందితులకు గుర్తింపుకార్డులు ఇవ్వక, కారాగారానికి సంబంధించిన దస్త్రాలు సక్రమంగా నిర్వహించకపోవడంపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌ ఉపకారాగారం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 20 May 2024 04:34 IST

ఉప కారాగారం అధికారులపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం 

ఉపకారాగారంలో దస్త్రాలు పరిశీలిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌ 

హిందూపురం అర్బన్, న్యూస్‌టుడే: ఉపకారాగారంలో ఉంటున్న కొంత మంది నిందితులకు గుర్తింపుకార్డులు ఇవ్వక, కారాగారానికి సంబంధించిన దస్త్రాలు సక్రమంగా నిర్వహించకపోవడంపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌ ఉపకారాగారం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక ఉపకారాగారాన్ని జిల్లా అదనపు న్యాయమూర్తి కంపల్లె శైలజతో కలిసి తనిఖీ చేశారు. తొలుత నిందితుల వివరాలు తెలుసుకొన్నారు. దస్త్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటాన్ని గుర్తించి సూపరింటెండెంట్‌పై అసహనం వ్యక్తం చేశారు. నిందితుల్లో కొంతమందికి గుర్తింపు కార్డులు ఇవ్వడంలో ఎందుకు నిర్లక్ష్యం చేశారని హెడ్‌ వార్డర్‌ రామాంజినాయక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార పదార్థాల నాణ్యత, సౌకర్యాలు పరిశీలించారు. అనంతరం ఆయన నిందితులతో మాట్లాడారు. కొంత కాలం కింద హెడ్‌ వార్డ్‌ హరినాథ్‌ మద్యం తాగి విధులకు హాజరైనా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సరైన సమాధానం ఇవ్వకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హాజరు పుస్తకంలో సంతకాలు సక్రమంగా లేవని  అసహనం వ్యక్తం చేసి విధి నిర్వహణలో ఇంత నిర్లక్ష్యం తగదన్నారు. తాను మళ్లీ కారాగారాన్ని పరిశీలిస్తానని, అప్పటికీ పనితీరు మార్చుకోకపొతే చర్యలు తప్పవని హెచ్చరించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని