logo

విద్యుదాఘాతానికి యువతి బలి

విద్యుదాఘాతంతో వివాహిత మృతి చెందిన ఘటన బెళుగుప్ప మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని విరుపాపల్లికి చెందిన  చైతన్య(22) సోమవారం ఉదయం ఇంటి దగ్గర విద్యుత్తు మోటారును ఆన్‌ చేయడానికి ప్రయత్నించింది.

Published : 20 May 2024 04:38 IST

బెళుగుప్ప(ఉరవకొండ), న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో వివాహిత మృతి చెందిన ఘటన బెళుగుప్ప మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని విరుపాపల్లికి చెందిన  చైతన్య(22) సోమవారం ఉదయం ఇంటి దగ్గర విద్యుత్తు మోటారును ఆన్‌ చేయడానికి ప్రయత్నించింది. స్టార్టర్‌ పెట్టెకు విద్యుత్తు సరఫరా జరిగి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు మృతదేహాన్ని కళ్యాణదుర్గం తరలించారు. భర్త మారుతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారికి మూడేళ్ల హేమతేజ్, 11 నెలల వయస్సు ఉన్న సాయిధరమ్‌తేజ ఉన్నారు.


ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత

బుక్కరాయసముద్రం: బుక్కరాయసముద్రం చిక్కవడియార్‌ చెరువులోకి ఈతకు వెళ్లిన ఇమామ్‌బాషా(12) అనే బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో ముగిని మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బుక్కరాయసముద్రంలోని ఇందిరమ్మకాలనీకి చెందిన రజాక్‌వలి, అరుణ దంపతుల కుమారుడు ఇమామ్‌బాషా ఆదివారం స్నేహితులతో కలసి సిద్ధరాంపురం రోడ్డులో ఉన్న చెరువు వద్దకు ఈతకు వెళ్లాడు. చెరువులో భారీ గోతులు ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. దీంతో స్నేహితులు బంధువులకు సమాచారం ఇవ్వడంతో చెరువులో గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. బాలుడి తల్లి అరుణ బోరున విలపించారు. బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని