logo

కొడవలితో వైకాపా కార్యకర్త వీరంగం

సార్వత్రిక ఎన్నికలు ముగిసి వారం రోజులు కాకుండానే ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడానికి గ్రామాల్లో వైకాపా నాయకులు వ్యూహం పన్నుతున్నారు.

Published : 20 May 2024 04:42 IST

కొడవలి పట్టుకొని వీధుల్లో తిరుగుతున్న వైకాపా కార్యకర్త కుళ్లాయప్ప

కనగానపల్లి,న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలు ముగిసి వారం రోజులు కాకుండానే ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడానికి గ్రామాల్లో వైకాపా నాయకులు వ్యూహం పన్నుతున్నారు. అమాయకులను రెచ్చగొట్టి మద్యం తాపించి ప్రజలపైకి ఉసిగొల్పడంతో ఓ వైకాపా కార్యకర్త కొడవలి చేతపట్టుకొని గ్రామ వీధులో వీరంగం సృష్టించాడు. కనగానపల్లి మండలం ఎలకుంట్లలో ఆదివారం సాయంత్రం వైకాపా కార్యకర్త కుళ్లాయప్ప మద్యం తాగి కొడవలి చేతపట్టుకొని తెదేపా వాళ్లను నరుకుతా అంటూ అర్ధగంట వీధుల్లో వీరంగం సృష్టించాడు. చేతిలో కొడవలి ఉండటంతో అతడిని ఎవరూ నిలువరించలేకపోయారు. గ్రామంలోని ప్రజలు భయాందోళన చెందారు. ఇంటి నుంచి బయటకు వస్తున్న తెదేపా కార్యకర్త బాలుపై దాడి చేయడానికి ప్రయత్నం చేయడంతో అక్కడున్న వారు అడ్డుకొని కొడవలి లాక్కొని పంపించేశారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషనుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని