logo

నేటి నుంచి పెన్నహోబిలం శ్రీవారి బ్రహ్మోత్సవాలు

పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాలకు రాష్ట్రంతోపాటు కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు.

Published : 20 May 2024 04:58 IST

28న రథోత్సవం

స్వామి మూల విరాట్టు 

ఉరవకొండ, న్యూస్‌టుడే: పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాలకు రాష్ట్రంతోపాటు కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. 20న స్వామి ఉత్సవ విగ్రహాలు ఆమిద్యాల నుంచి పెన్నహోబిలం ఆలయానికి చేరుకోవడంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. 21న ప్రాకారోత్సవం, 22న చంద్రప్రభ వాహన సేవ, 23న గో, శేష వాహన సేవ, 24న హంస వాహనం, 25న హనుమద్‌ వాహనం, 26న గరుడ వాహనం, శ్రీవారి కల్యాణోత్సవం, 27న ఐరావత వాహనం, 28న ఉదయం మడుగుతేరు, సాయంత్రం బ్రహ్మ రథోత్సవం, 29న అశ్వ వాహనసేవ, 30న ధ్వజారోహణం, శయనోత్సవం, 31న ఉత్సవ విగ్రహాలు ఆమిద్యాలకు వెళ్లడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నట్లు ఆలయ ఈవో విజయ్‌కుమార్‌ తెలిపారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా తాగునీరు, వసతి, భోజన సదుపాయం కల్పించే దిశగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆలయ ఉత్తర ద్వారం ముందు చలువ పందిళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

లక్ష్మీనరసింహస్వామి ఆలయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని