logo

అనంతలో జోరు వాన

జిల్లా కేంద్రం అనంత నగరంలో  సోమవారం రాత్రి జోరువాన కురిసింది.  పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించింది. పలు రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి.

Published : 21 May 2024 02:45 IST

కూలిన చెట్లు, విద్యుత్తు స్తంభాలు

రామ్‌నగర్‌ 80 అడుగుల రహదారి జలమయం 

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం అనంత నగరంలో  సోమవారం రాత్రి జోరువాన కురిసింది.  పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించింది. పలు రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. వృక్షాలు సైతం నేలకొరిగాయి. చెట్లు కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల మీద పడటంతోపాటు అవి దెబ్బతిన్నాయి. పలుచోట్ల రోడ్డుకు అడ్డంగా కూలాయి. విద్యుత్తు సరఫరా వెంటనే ఆపేయడంతో ప్రమాదాలు తప్పాయి. నగరానికి తాగునీరు అందించే పీఏబీఆర్‌ డ్యామ్‌లో నీటి నిల్వలు అడుగంటిపోతున్న సమయంలో వర్షాలు ప్రారంభం కావడంతో కొంత ఉపశమనం లభించింది. ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షానికి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సుమారు రెండు గంటల పాటు జోరుగా వర్షం కురిసింది.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం

అనంతపురం (విద్యుత్తు) న్యూస్‌టుడే: అనంతపురంలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. నగరంలో గాలివానకు 40 చెట్లు విరిగిపడటంతో పాటు 30 విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. ఈ క్రమంలో నగరంలో సాయంత్రం 4.30 నుంచి రాత్రి 12 గంటల వరకు 75 శాతం ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. విద్యుత్తు అధికారులు, ఉద్యోగులు చెట్లు, స్తంభాలు పడిపోయిన ప్రాంతాలను పరిశీలించి మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఉపకేంద్రాల్లో సమస్యలు తలెత్తడంతో కొన్ని ప్రాంతాలకు మొదటగా సరఫరాను ఇచ్చామని అనంతపురం నగర డివిజన్‌ ఈఈ జె.వి.రమేశ్‌ వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని