logo

ప్రభుత్వం విస్మరించింది.. ఆర్డీటీ నిర్మించింది

శిథిలమైన చెక్‌డ్యామ్‌ను పునర్నిర్మించాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరితే పట్టించుకోలేదు. విసిగి వేసారిన వారు ఆర్డీటీ సంస్థను సంప్రదించారు.

Published : 21 May 2024 02:58 IST

యాడికి, న్యూస్‌టుడే: శిథిలమైన చెక్‌డ్యామ్‌ను పునర్నిర్మించాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరితే పట్టించుకోలేదు. విసిగి వేసారిన వారు ఆర్డీటీ సంస్థను సంప్రదించారు. ఎట్టకేలకు ప్రజల భాగస్వామ్యంతో చెక్‌డ్యామ్‌ నిర్మించారు. యాడికి మండలం కోనఉప్పలపాడు గ్రామ సమీపంలో వంక ఉంది. కోన వద్ద ఉన్న చెరువు నిండితే, వర్షాలు కురిస్తే వంక పారుతుంది. దానిపై చెక్‌డ్యామ్‌ నిర్మిస్తే నీరు నిల్వ చేరి పరిసర ప్రాంతాల బోరుబావుల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని తెదేపా ప్రభుత్వం గుర్తించింది. అప్పట్లో చెక్‌డ్యామ్‌ నిర్మించింది. భారీ వర్షాలకు వంక ఉద్ధృతంగా పారి కొట్టుకుపోయింది. నాలుగున్నర ఏళ్లుగా వైకాపా ప్రభుత్వం  పట్టించుకోక పోవడంతో విసిగిన రైతులు ఆర్డీటీ సంస్థను ఆశ్రయించారు. స్థానికుల సహకారం కూడా ఉండాలని ఆర్డీటీ ప్రతినిధులు చెప్పడంతో స్థానిక తెదేపా నాయకుడు చవ్వా గోపాల్‌రెడ్డితో పాటు ఇతరుల భాగస్వామ్యంతో దాదాపు రూ.లక్షన్నర వరకు సంస్థకు చెల్లించారు. మొత్తం రూ.8 లక్షలు వెచ్చించి చెక్‌డ్యామ్‌ నిర్మించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని